హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకేష్‌ పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన

ప్రకాశం: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌రావు, కలెక్టర్‌ పి. రాజాబాబు, జిల్లా అధికారులతో కలిసి సభా వేదిక, భద్రత, ప్రజా సౌకర్యాలు, ట్రాఫిక్‌ నిర్వహణ తదితర ఏర్పాట్లను సమీక్షించారు. మంత్రి పర్యటన విజయవంతం చేయాలని ఆయన కోరారు.