హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంప్లెక్స్ పనులు ఆపాలని స్థానికుల డిమాండ్

కృష్ణా: గుడివాడ ఆర్టీసీ కాలనీలో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం నిరసన చేపట్టారు. ఆర్టీసీ కాలనీ, ఆటోనగర్‌కు చెందిన నివాసితులు నిర్మాణ స్థలం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోనగర్ ఏర్పడక ముందునుంచే తాము ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని తెలిపారు. తక్షణమే కాంప్లెక్స్ నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.