హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి'

ADB: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ప్రతీ వేడుకకూ ఒక మొక్క నాటి సంరక్షించాలని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు. మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, డీఎండబ్ల్యూ కలీం, అధికారులు తదితరులున్నారు.