హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు బాచి ఎంపిక

MLG: ములుగు (M) బండారుపల్లి PM శ్రీ మోడల్ స్కూల్‌ & జూనియర్‌ కళాశాల విద్యార్థి గుడెల్లి బాచి జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యాడు. దక్షిణ జోనల్‌ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నాడు. 60 మీటర్ల పరుగులో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి పతకం అందుకున్నాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ సింగారం దేవకి, అధ్యాపకులు అభినందించారు.