హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఎత్తివేయాలి’

NDL: రేషన్ బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని ఎత్తివేయాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ మురళీ కోరారు. గురువారం బేతంచెర్ల తహశీల్దార్ నాగమణికి డీలర్ల సమస్యలపై మండల అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్, అనీఫ్ బాషా ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం వల్ల రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మురళీ తెలిపారు.