హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో పోటీలు

MBNR: జడ్చర్ల క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ జయంతి సందర్భంగా కేజీబీవీ బాలికల పాఠశాలలో కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. క్లబ్ వ్యవస్థాపకుడు వాస రాఘవేందర్ సూచన మేరకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఆలంపల్లి ప్రదీప్, కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.