హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్టీఆర్ కళాశాలలో 31న జాబ్ మేళా

​మహబూబ్‌నగర్ ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆగస్టు 31న జాబ్ మేళా జరగనుంది. టాటా క్యాపిటల్, ముత్తూట్ ఫైనాన్స్ సహా పలు సంస్థలు పాల్గొంటాయని ప్రిన్సిపల్ తెలిపారు. 18-35 ఏళ్ల మహిళలు (ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ) అర్హులని చెప్పుకొచ్చారు. అభ్యర్థులు రెజ్యూమ్, ఆధార్, సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.