హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు చెల్లించాలని వినతి

MHBD: ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సూపరిండెంట్ రాజేశ్వరికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ... ఫీల్డ్ అసిస్టెంట్లకు గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు.