హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతుల అభ్యున్నతే సహకార సంఘాల లక్ష్యం'

KMR: రైతుల అభ్యున్నతి కోసం సహకార సంఘాలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గురువారం మాచారెడ్డి సొసైటీ చైర్మన్‌గా నౌసి లాల్ నాయక్ ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ మాట్లాడుతూ సొసైటీ ద్వారా రైతులకు రుణాలు, ఎరువులు సకాలంలో అందిస్తామని తెలిపారు. సహకార సంఘం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.