హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట మార్పిడితో రైతులకు మేలు: కలెక్టర్

GWDL: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జోగులాంబ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులకు నానో ఎరువులపై అవగాహన సదస్సు జరిగింది. సాధారణ యూరియాకు బదులు నానో యూరియా వాడాలని, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.