హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నానో ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలి'

NGKL: నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక ఎరువుల వినియోగం, ప్రయోజనాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కావద్దని సూచించారు.