హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత జట్టులోకి దిగ్గజాల కొడుకులు!

భారత క్రికెట్ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్‌కు టీమిండియా అండర్-19 జట్టులో చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్‌లో సెప్టెంబర్ 18, 21, 23 తేదీల్లో జరిగే మూడు యూత్ వన్డేలకు వీరు ఎంపికయ్యారు. అయితే రెడ్‌బాల్ జట్టులో ఇద్దరికీ అవకాశం లభించలేదు. ఇటీవల శ్రీలంక పర్యటనలో అన్వయ్ 101 పరుగులు చేశాడు.