NLG: పానగల్ రోడ్డులో చేపలు విక్రయించే 100 మంది పేదలకు ప్రత్యామ్నాయ స్థలం చూపించి మార్కెట్ నిర్మించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పేదల ఉపాధిని దెబ్బతీయవద్దని సీపీఎం నేత హశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సలీం కోరారు. ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
తెలంగాణ
పేదల ఉపాధిని దెబ్బతీయవద్దు: సీపీఎం - సీఐటీయూ


