హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌కు రాఖీ కట్టిన చిన్నారులు

NGKL: రాఖీ పండుగ సందర్భంగా సరస్వతి శిశుమందిర్ విద్యార్థినీ, విద్యార్థులు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ ఆత్మీయంగా ముచ్చటిస్తూ.. వారి విద్యాభ్యాసం, ఆసక్తులు, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.