అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. రైతులకు సాగునీరు అందడం లేదని వైసీపీ ఆరోపించింది. తుంగభద్రలో సరిపడా నీరు ఉన్నా.. పొలాల్లోకి విడుదల చేయడం లేదంటూ వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే, రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం ఉందని ఎమ్మెల్యే ప్రసాద్, ఎంపీ పార్థసారథి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రసాభాస


