హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విజేతగా నిలిచిన జిల్లా జట్టు

AKP: తిరుపతిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో అనకాపల్లి అండర్‌-23 పురుషుల జట్టు విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో సత్యసాయి జిల్లా జట్టుపై 3-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. కూరపాటి రమేష్, సాయిరామ్, రాజు మూడు గోల్స్ చేసి జట్టును గెలిపించారు. విజేతలను డీఎస్‌‌వో పూజారి శైలజ అభినందించారు.