హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలుకు 42 ఈ ఆటోలు

కర్నూలులో చెత్త సేకరణను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 42 ఈ- ఆటోలను మంజూరు చేసిందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ స్పష్టం చేశారు. గురువారం కార్పొరేషన్‌కు మంజూరైన ఈ-ఆటోలను ఆయన పరిశీలించారు. మొత్తం 91 ఈ-ఆటోలు మంజూరు అయ్యాయని, మిగతావి త్వరలో వస్తాయని చెప్పారు.