హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

ASR: సీఎం చంద్రబాబు ఈనెల 29న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 28వ తేదీ శుక్రవారం (రేపు) పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. కార్యక్రమం రద్దు విషయాన్ని ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.