సత్యసాయి: రాబోయే గణేష్ ఉత్సవాల నేపథ్యంలో హిందూపురం పట్టణంలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ గురువారం పర్యటించారు. పలు ప్రాంతాలను పరిశీలించి నిర్వాహకులు, పీస్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. మండపాలకు అనుమతులు తీసుకోవాలని, డీజేలు నిర్ణీత శబ్ద పరిమితుల్లోనే వాడాలని సూచించారు. ఊరేగింపుల సమయంలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచుతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి'


