హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు పట్టాలపై విద్యార్థుల ప్రయాణం

ELR: ఉంగుటూరు మండలం నారాయణపురంలోని రైల్వే అండర్ బ్రిడ్జి (మోరి) కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో హైస్కూల్, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు, బురదలోనే నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. మరికొందరు ప్రమాదకరంగా రైలు పట్టాలపై నుంచి వెళ్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు.