హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆవలింతలు పదేపదే వస్తున్నాయా?

రోజంతా పదేపదే ఆవలింతలు వస్తుంటే కేవలం నిద్రలేమిగా తీసిపారేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కొన్నిసార్లు శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతం కావచ్చని చెబుతున్నారు. తగినంత నిద్ర లేకపోవడం, శారీరక లేదా మానసిక అలసట వల్ల తరచూ ఆవలింతలు రావచ్చు. మెదడు విశ్రాంతి కోసం ఇలా సంకేతాలు పంపుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.