హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిరిపురంలో లో వోల్టేజీ కష్టాలు

KKD: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో నెలల తరబడి కొనసాగుతున్న లో వోల్టేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్లు, లైట్లు సక్రమంగా పనిచేయక ఉక్కపోతతో అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. లో వోల్టేజీ కారణంగా విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.