హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పాడ తీర రక్షణకు రూ.323 కోట్లు

KKD: ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు కేంద్ర ప్రభుత్వం రూ.323 కోట్లు మంజూరు చేయడం, పనుల పర్యవేక్షణకు మద్రాస్ ఐఐటీతో ఒప్పందం కుదరడంపై యూ.కొత్తపల్లి మండల మత్స్యకార నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తీర రక్షణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేస్తామని ఎంపీ తెలిపారు.