హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధి పేరుతో దుకాణాలు పగలగొట్టడం అన్యాయం'

NLR: కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం కావలి పట్టణంలో పర్యటించారు. అనంతరం పట్టణంలోని తుమ్మలపెంట సెంటర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో ఇటీవల పేద ప్రజల దుకాణాలను, ఇళ్లను పగలగొట్టడం అన్యాయం అన్నారు. నష్టపోయినటువంటి దుకాణదారులకు, ప్రజలకు నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.