హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటరు జాబితా సవరణకు దరఖాస్తు చేసుకోండి'

MDK: చేగుంట మండల కేంద్రంలోని జీపీ కార్యాలయం వద్ద ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు నోటీసులు పంపిణీ చేశారు. గ్రామంలో 300 మందికి నోటీసులు వచ్చినట్లు అధికారి గోపాల్ పేర్కొన్నారు. ఓటరు వివరాల్లో తప్పులున్న వారు సంబంధిత ఫారమ్స్ ద్వారా సవరణకు అప్లై చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది శ్రీనివాస్, పద్మ, ఆకుల సుఖేందర్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.