హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్క్రాప్ సామగ్రిని పరిశీలించిన ఛైర్‌పర్సన్ పల్లవి

ATP: అనంతపురం మార్కెట్‌ యార్డులోని స్క్రాప్ సామగ్రిని యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి గురువారం పరిశీలించారు. పనికిరాని స్క్రాప్‌ను గుజ్జిరికి తరలించాలని అధికారులకు సూచించారు. అలా వచ్చిన ఆదాయంతో మార్కెట్‌యార్డులో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.