ASF: సిర్పూర్ (టి) మండల నూతన MEOగా పర్ష చంద్రశేఖర్ గురువారం స్థానిక MRC భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాగజ్ నగర్, కౌటాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు, పథకాల సమర్థ అమలుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
తెలంగాణ
నూతన MEO గా పర్ష చంద్రశేఖర్ బాధ్యతలు


