NDL: రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆళ్లగడ్డ మండల డీలర్ల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాలకు పంపిణీ చేసే ప్రతి బస్తాలను స్కానింగ్ చేసే విధానాన్ని తొలగించాలన్నారు. రేషన్ డీలర్లకు ప్రస్తుతం ఇస్తున్న కమిషనర్‌ను పెంచాలని కోరుతూ మండల తహశీల్దార్ జ్యోతి రత్న కుమారికి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ డీలర్ల సమస్యలపై వినతి


