హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెల్ట్ షాపులకు అనుమతులపై ఆగ్రహం

కృష్ణా: మద్యం దశలవారీగా నియంత్రిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులిస్తూ విక్రయాలను పెంచుతోందని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు ఆరోపించారు. మచిలీపట్నంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు.