హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరు దుకాణాల్లో చోరీ

NDL: పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నారాయణ ఆలయ పరిసరాల్లోని ఆరు దుకాణాల్లో చోరీ జరిగిన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి దుకాణాల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.