హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలి'

ATP: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని పీడీఎస్‌యు నియోజకవర్గ కార్యదర్శి వినోద్ పేర్కొన్నారు. గురువారం గుత్తి కోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు. వంటగది పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వంట చేసే సిబ్బందికి సూచించారు.