హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 31న సర్వసభ్య సమావేశం

AKP: నాతవరం మండల సర్వసభ్య సమావేశం ఈనెల 31న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం.సత్య శ్రీనివాస్ గురువారం తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 31న ఉదయం 10 గంటలకు ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. మండల ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కోరారు.