హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టైక్వాండో విజేతలకు చైర్‌పర్సన్ సత్కారం

ATP: హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ప్రపంచ ఓపెన్ టైక్వాండో పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన అనంతపురం చిన్నారులను మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి అభినందించి, ఘనంగా సత్కరించారు. 12 దేశాలు, 22 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రతిభ చాటడం గర్వకారణమన్నారు. విజేతలకు శాలువా, మెమెంటోతో పాటు రూ.10వేల నగదు అందజేశారు.