హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎటువంటి క్షుద్రపూజలు జరగలేదు

కోనసీమ: చిర్రయానాం తీరంలో ఎటువంటి క్షుద్రపూజలు జరగలేదని కాట్రేనికోన SI అవినాశ్ స్పష్టం చేశారు. గ్రామస్థులు అందించిన సమాచారంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. గుప్తనిధుల ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. అక్కడ దొరికిన పూజా సామగ్రిపై దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో తేలే అంశాల ఆధారంగా కేసు నమోదు చేస్తామన్నారు.