హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతానగరం మండలంలో ఎండుతున్న వరి పొలాలు

E.G: సీతానగరం మండలంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పంట భూములు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడపాదడపా కురిసే వర్షాలు సాగుకు సరిపోకపోవడంతో అన్నదాతలు కాలువల నీటిపైనే ఆధారపడుతున్నారు. సాగు పనులు ముందుకు సాగాలంటే కాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని మండల రైతాంగం కోరుతోంది.