హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైన్స్ యాజమాన్యాలతో పోలీసుల సమావేశం

GNTR: తాడేపల్లి సీఐ వీరేంద్ర సూచనలతో బార్, వైన్స్ షాపుల యజమానులతో గురువారం ఎస్సై ఖాజావలి సమావేశం అయ్యారు. మద్యం దుకాణాల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అనుమానితుల సమాచారం వెంటనే అందించాలని కోరారు. నిర్ణీత సమయాల్లోనే షాపులు నడపాలని, మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.