SKLM: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి గురువారం ప్రారంభించారు. మండల పరిషత్ నిధులు రూ.9 లక్షలతో ఈ పనులు చేపట్టారన్నారు. గత ఐదేళ్లలో మండల పరిషత్ నుంచి ప్రతి గ్రామంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైసీపీ సెక్రటరీ అంబటి రాంబాబు, మండల విప్ రాజారావు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
బుడగట్లపాలెంలో సీసీ రోడ్లు, డ్రైన్ల ప్రారంభం


