హైదరాబాద్: 28°C
క్రీడలు

అండర్-19 జట్టులోకి సెహ్వాగ్, ద్రవిడ్

భారత మాజీ దిగ్గజాలు వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్‌ల కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ భారత అండర్-19 వన్డే జట్టుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 18 నుంచి ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ఈ యువ జట్టును ప్రకటించింది. దిగ్గజాల వారసులు ఇద్దరూ ఒకేసారి జాతీయ జూనియర్ జట్టుకు ఎంపిక కావడం విశేషం.