హైదరాబాద్: 28°C
క్రీడలు

లంచ్‌ బ్రేక్‌.. వికెట్ కోసం చెమటోడుస్తున్న భారత్

శ్రీలంక - భారత్ జట్ల మధ్య ఐదో రోజు ఆట తొలి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక 104 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. దాదాపు 40 ఓవర్లపాటు వికెట్ ఇవ్వకుండా సెషన్‌ ముగించడం గమనార్హం. సోనాల్ దినుష (55*), కేశర నువాంత (46*) ఏడో వికెట్‌కు 111 పరుగులు జోడించారు. దీంతో శ్రీలంక ఆధిక్యం 116 పరుగులకు చేరింది.