హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతమాగులూరులో మంచినీటి కష్టాలు!

BPT: సంతమాగులూరు మండలంలో భూగర్భ జలాలు పడిపోవడంతో మంచినీటి ఎద్దడి తీవ్రమైంది. గురిజేపల్లి, తంగేడుమల్లిలో చేతిపంపులు ఇంకిపోగా, నిధుల కొరతతో జల్‌జీవన్ మిషన్ పనులు మందగించాయి. బాధితులకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, చెరువులు నింపేందుకు సాగర్ నీటి విడుదల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.