E.G: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని TDP రాజానగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: చౌదరి


