PLD: చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేలూరు గ్రామానికి చెందిన ఏడుగురి భౌతికకాయాలకు మాజీ మంత్రి విడదల రజిని నివాళులర్పించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. గాయపడిన ఇద్దరు మహిళలు, బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాద బాధితులను మాజీ మంత్రి పరామర్శ


