CTR: పుంగనూరు పట్టణం NSపేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జగనన్న కాలనీలో తాగునీటి సమస్య


