హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూ సమస్యలపై రైతులు ఆర్డీవోకు ఫిర్యాదు

 AKP: రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామానికి చెందిన రైతులు తమ భూ సమస్యలపై నర్సీపట్నం ఆర్డీవో వివి రమణ వద్ద గురువారం ఫిర్యాదు చేశారు. రైతులకు చెందిన సుమారు 400 ఎకరాల భూములను రెవిన్యూ అధికారులు చట్టానికి వ్యతిరేకంగా వేరే వారికి పాస్‌బుక్‌లు మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇనాం చట్టం కింద తహసిల్దార్ తప్పుడు రికార్డులు సృష్టించారని తెలిపారు.