హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దళితుడి ఇంటి నిర్మాణ కడగాలు కూల్చివేత.!

CTR: GD.నెల్లూరు మండలంలో ఇంటి నిర్మాణానికి ఏర్పాటు చేసిన కడగాలను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే కూల్చివేశారని ఓ దళిత కుటుంబానికి చెందిన బాధితుడు ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యేకు అర్జీ సమర్పించగా, సానుకూలంగా స్పందించి ఘటనను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయినప్పటికీ కడగాలు కూల్చివేయడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.