హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సులో 50 లక్షల బంగారం చోరీ...?

NLR: బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్ బస్సులో దాదాపుగా 50 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. ఉలవపాడు మండలం రాజుపాలెం వద్ద బంగారు నగలు కనిపించక పోవడాన్ని ప్రయాణికుడు వెంకటకృష్ణ గుర్తించారు. దీంతో బస్సును టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ చోరీపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.