హైదరాబాద్: 28°C
క్రీడలు

పట్టువదలని శ్రీలంక.. 300 దాటిన స్కోరు

కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఐదో రోజు శ్రీలంక బ్యాటర్లు కేశర నువాంత, సోనాల్ దినుష ఏడో వికెట్‌కు అజేయంగా భారీ భాగస్వామ్యం నెలకొల్పుతూ భారత బౌలర్లను అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీలంక 92 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఆ జట్టు ఆధిక్యం 101 పరుగులకు చేరింది.