హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నగరంలో మరోసారి ఏసీబీ సోదాలు

HYD: నగరంలో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ AD జయరాజు ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే HYD సహా 12 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వరంగల్ రేంజ్ ACB డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.