హైదరాబాద్: 28°C
తెలంగాణ

తలుపుల్లేని మరుగుదొడ్లు.. విద్యార్థినుల అవస్థలు

NGKL: ఉప్పునుంతల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఉపయోగించే మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. తలుపులు లేకుండా ఉండటంతో వారు అసౌకర్యానికి గురవుతున్నారు. మూడింటిలో ఒక్కదానికే తలుపు ఉండటంతో అందరూ దానినే వినియోగిస్తున్నారు. పక్కనున్న ప్రహరీ కూలిపోవడంతో అభద్రత నెలకొంది. మరమ్మతులు చేసి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.