KRNL: ఓర్వకల్లు మండలంలోని గ్రామాల్లో ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షపాతం లేక ఈ ఏడాది రైతులు అరకొరగానే పంటలు సాగు చేశారు. కంది, సజ్జ, పత్తి తదితర పంటలు సాగు చేసినా అడపాదడపా వర్షాలతో పంటలు ఎండిపోతున్నాయి. ఆకాశం మేఘావృతమైనా వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వానల్లేవు.. ఓర్వకల్లు రైతుల్లో గుబులు!


